వివాహం చేసుకున్న పవన్ కల్యాణ్ హీరోయిన్ మీరా చోప్రా
సినీ నటి మీరా చోప్రా వివాహం చేసుకుంది. రాజస్థాన్‌లోని ఓ రిసార్టులో మంగళవారం వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్‌ను వివాహమాడారు. పెళ్లి ఫోటోలను మీరా చోప్రా ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.
పవన్ కల్యాణ్ సరసన "బంగారం" సినిమాలో హీరోయిన్‌గా మీరా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వాన, మారో, గ్రీకు వీరుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. తమిళ సినిమాల్లోనూ మెరిసింది.
మోడలింగ్‌తో తన కెరీర్ ప్రారంభించిన మీరా ఆ తరువాత దక్షిణాది నుంచి బాలీవుడ్ వైపు మళ్లింది. చివరిసారిగా ఆమె జీ5 ఫిలిమ్స్‌కు చెందిన సఫేద్ చిత్రంలో కనిపించింది.