బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 7 మార్చి 2024 (19:35 IST)

బంగారం ధర భగభగ: 10 గ్రాములు రూ. 67,000

gold
బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో మన దేశంలో కూడా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 67,000 దాటి ఇంకా ముందుకు సాగుతోంది. అలాగే వెండి ధరలు కూడా పెరిగాయి. 
 
బంగారం ధరలు పెరుగుదలకు కారణం అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిస్థితులు అని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిస్తామని వెల్లడించిన తర్వాత ఒక్కసారిగా బంగారం ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.