సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 జులై 2023 (18:45 IST)

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గుచేటు.. 72,767 బాలికలు, మహిళలు ఏమయ్యారు?

Young woman
తెలుగు రాష్ట్రాల్లో ఏటా వేలాది సంఖ్యలో బాలికలు, మహిళలు అదృశ్యమవుతున్నారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బాలికలు మహిళల అదృశ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. రాజ్యసభలో తలెత్తిన ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా లిఖిత పూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు. 
 
తెలుగు రాష్ట్రాల్లో గత మూడేళ్ల పాటు 72వేల 767 మంది కనిపించకుండా పోయారని తెలిపారు. వీరిలో బాలికలు 15వేల 994 మంది కాగా, మహిళలు 56వేల 773 మంది అంటూ అజయ్ మిశ్రా చెప్పుకొచ్చారు. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం ఈ వివరాలు వెల్లడైనట్లు తెలిపారు. 
 
2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో ఏపీలో 7,928 మంది బాలికలు, 22,278 మహిళలు అదృశ్యం కాగా, తెలంగాణలో ఇదే కాలంలో 8,066 మంది బాలికలు, 34వేల 495 మంది మహిళలు కనిపించకుండా పోయారని కేంద్రం వెల్లడించింది.