బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 జనవరి 2022 (15:23 IST)

Bangarraju Teaser అవుట్: ఊరుకోవే పుటికి.. కితకితలెడుతున్నాయే (Video)

న్యూఇయర్ కానుకగా బంగార్రాజు టీజర్ రిలీజైంది. కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కథానాయకులుగా నటించిన ఈ మల్టీస్టారర్ మూవీకి కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.  
 
జీ స్టూడియోస్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బంగార్రాజు సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.  
 
బంగార్రాజు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కొత్త ఏడాది ఆరంభాన్ని పురస్కరించుకుని శనివారం చిత్ర యూనిట్ టీజర్‌‌ని విడుదల చేసింది. టీజర్‌లో తండ్రీ తనయులు నాగార్జున, నాగచైతన్యలు డైలాగ్స్, మాటలతో అలరించారు. నాగార్జున ఎంట్రీతో టీజర్ ఆరంభం అయి.. నాగ్,  నాగచైతన్యలు మీసాలు తిప్పడంతో ఎండ్ అయింది. 
 
సోగ్గాడే చిన్నినాయనే సినిమాలో నాగ్ కర్రను బండికి ఎలా తగిలిస్తాడో.. చై అచ్చు అలానే చేశాడు. 'ఊరుకోవే పుటికి.. కితకితలెడుతున్నాయే' అని రమ్యకృష్ణతో నాగార్జున చెప్పే డైలాగ్ హైలైట్ అని చెప్పొచ్చు.  మొత్తానికి టీజర్ అదిరింది.