మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 అక్టోబరు 2021 (13:28 IST)

BiggBoss5: లోబోకు పింకీ వార్నింగ్!.. నడుము చూసే సరికి?

బిగ్‌బాస్‌ హౌస్‌లో నవ్వుల వర్షం కురుస్తోంది. లోబో, ప్రియాంకల మధ్య ‘ఖుషి’ సినిమాలోని నడుమ సీన్‌ రిపీట్‌ చేశారు. బుద్ధిగా చదువుకుంటున్నట్టు కనిపిస్తూనే ప్రియాంక వైపు లోబో ఓరగా చూస్తాడు. అంతే ‘లోబో.. నీ చూపు సరిగా లేదు’ అంటూ భూమికలా ప్రియాంక కస్సుమంది. ఇలా సరదాగా సాగే ఎపిసోడ్‌లో ఒక్కసారిగా మాటల యుద్ధం మొదలైంది. ఈ వారం బెస్ట్‌, వరస్ట్‌ పెర్ఫార్మర్‌ ఎవరో? నిర్ణయించే ప్రయత్నంలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు.  
 
ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్లేబాయ్‌గా అలరిస్తున్నాడు శ్రీరామచంద్ర. తాజాగా కెప్టెన్సీ టాస్క్‌లో గెలిచి ఇంటి కొత్త కెప్టెన్‌ అయ్యాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ ‘బిబి షో’ పేరుతో ఇచ్చిన టాస్క్‌లో ఇంటి సభ్యులందరూ పాల్గొన్నారు. సిరి.. హమీదాల్లో ఎవరిని ఎంచుకుంటారు?అని శ్రీరామచంద్రను హౌస్‌మేట్స్‌ ప్రశ్నించగా, లంచ్‌కు సిరి.. డిన్నర్‌కు హమీదా ఎంచుకుంటానని చెప్పాడు. 
 
మరి టిఫిన్‌కు ఎవరు?అని ప్రశ్నించగా, శ్రీరామ్‌ నవ్వాపుకోలేకపోయాడు. హౌస్‌మేట్స్‌ ఎలా మాట్లాడతారు? ఎలా ప్రవర్తిస్తారు? అన్న దాన్ని అనుకరించి చూపించాడు సన్నీ విజయ్‌. ‘సిరి.. దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు’అని కోరగా, ‘సోమవారం నామినేషన్స్‌లో చూసుకుందాం’ అంటూ సిరి సమాధానంతో సన్నీ షాకయ్యాడు. విన్నర్ ఎవరో తెలిసే వరకు ప్రోమో చూసి ఆనందించండి.