సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (22:49 IST)

బిగ్ బాస్ హౌస్‌లో లహరి కారు క్రాష్, ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అంటూ బయటికెళ్లిపోయిన లహరి

బిగ్ బాస్ ఇంట్లో లహరి నడిపిన కారు క్రాష్ అయ్యింది. అదే సమయంలో ప్రియ కారు కూడా అదేరకంగా మారింది. దీనితో వాళ్లిద్దరి కార్లలో ఎవరి కారు బాగుపడుతుందో, బయటపడిదెవరో అని ఉత్కంఠ రేగింది. చివరికి హోస్ట్ నాగార్జున లహరి కారు బాగుపడదని చెప్పడంతో ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది.
 
ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. శ్రీరామ్, మానస్, ప్రియాంక, లహరి, ప్రియలలో సింగర్ శ్రీరామ్, మానస్, ప్రియాంకలు ఓటింగుతో సేఫ్ అయ్యారు. ఈ రోజు ఆదివారం ఎపిసోడ్లో నామినేషన్లో ప్రియా, లహరి వుండగా అనూహ్యంగా ప్రియా సేఫ్ అయ్యింది. లహరి ఎలిమినేట్ అయ్యింది.

లహరి ఎలిమినేట్ అయ్యిందని హోస్ట్ నాగార్జున అనౌన్స్ చేయగానే హౌసులో ఉన్నవాలందరూ షాక్ అయ్యారు. కొందరైతే ఏడ్చేసారు. వారిని చూసిన లహరి.. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అంటూ బయటకు నడిచింది. అలా లహరి ఎలిమినేట్ అయ్యింది.
 
మొదటివారం సరయు, రెండోవారం కార్తీక దీపం సీరియల్ ఫేమ్ ఉమాదేవి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లహరి ఔట్ అయ్యింది. 19 మంది కంటెస్టంట్లలో ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు.