శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , బుధవారం, 22 సెప్టెంబరు 2021 (09:20 IST)

ఛాన్సుల‌ కోసం లహరి నాతో క్లోజ్ గా ఉంటుందన్న రవి

బిగ్ బాస్ సెలబ్రిటీల గుట్టంతా బయటపెడుతోంది. నాలుగు గోడల మధ్య జరిగేదంతా చూపించకపోయినా... తోటి ఇన్ మేట్ సభ్యుల ద్వారా అన్నీ బయటకు పొక్కుతున్నాయి. తాజాగా యాంకర్ల వివాదం మొదలైంది. చాన్సుల కోసం నేను నీ వెంట‌ప‌డుతున్నానా? అని ర‌విని నిల‌దీసింది  ల‌హ‌రి.
 
బిగ్ బాస్ 5 లో నామినేషన్  సందర్బంగా ర‌చ్చ రచ్చ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ల‌హ‌రి మ‌గ‌వాళ్ల‌తోనే మాట్లాడుతుంద‌ని, బాత్రూంలో ర‌విని హ‌గ్ చేసుకుంద‌ని ప్రియా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అయితే ఆన్ సీన్ లో ర‌వితో ముందుగా ప్రియ వెళ్లి... నువ్వు కుటుంబం ఉన్న‌వాడివి కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, బయ‌ట‌కు వేరేలా వెళుతుంద‌ని చెప్పింది. దాంతో ర‌వి కాస్త ఓవరాక్షన్ చేస్తూ లహ‌రికి ఎలా చెప్పాలో అర్థం కావ‌డం లేద‌ని, తను యాంకర్ గా ఛాన్స్ ల కోసం త‌న‌తో క్లోజ్ గా ఉంటుంద‌ని వ్యాఖ్యానించాడు.
 
తాజాగా విడుద‌లైన ప్రోమోలో మ‌ళ్లీ ఇష్ష్యూ చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఛాన్సుల కోసం నీ వెంట‌ప‌డుతున్నానా? అంటూ ల‌హ‌రి ర‌విని వెళ్లి నిల‌దీసింది. దానికి ర‌వి నేను అలా చెప్ప‌లేద‌ని అన్నాడు. ప్రియా నువ్వు అలానే అన్నావు బ్రో అంటూ ఏడ్చేసింది. ఇక యాంకర్ ర‌వి వెళ్లిపోయిన త‌ర‌వాత కూడా ప్రియా బాల్క‌నీలో కూర్చుని ఏడ్చుకుంటూ, నేను అబ‌ద్దం చెప్ప‌లేదు అమ్మా... నువ్వు నాకు ఎలా నేర్పించావో అలానే ఉన్నాను. న‌న్ను నువ్వు అర్థం చేసుకుంటే చాలు అంటూ ఏడ్చేసింది. ఇలా యంకర్ల బాగోతాన్ని బిగ్ బాస్ రచ్చకెక్కిస్తున్నాడు.