శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (10:48 IST)

బిగ్‌బాస్ ఐదో సీజన్ : ఎలిమినేషన్‌లో లహరి

బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ ఎపిసోడ్‌లో భాగంగా, మరో కంటెస్టెంట్‌ను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. ఈ వారం శ్రీరామచంద్ర, మానస్‌, ప్రియ, ప్రియాంక, లహరి నామినేషన్‌లో ప్రక్రియలో ఉన్నారు.
 
వీరిలో శ్రీరామ్‌, మానస్‌ భారీ ఓట్లతో ఓటింగ్‌లో ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. వీరి తర్వాత ప్రియాంక కూడా మంచి ఓట్లే సంపాదించుకుని సేఫ్‌ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. 
 
వీరికి కావాల్సినంత స్క్రీన్‌ స్పేస్‌ దొరకడంతో పాటు ఎలాంటి నెగెటివిటీ కూడా లేకపోవడంతో ఈ ముగ్గురూ ఈవారం సేఫ్‌ అయినట్లే! మిగిలిందల్లా లహరి, ప్రియ.
 
అయితే, ఈ వారం లహరి ఎలిమినేట్‌ అయినట్లు సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ లేడీ అర్జున్‌రెడ్డికి నేడు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆఖరి రోజు కానుంది.