శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (10:52 IST)

బిగ్ బాస్ 5: కంటిస్టెంట్ల తొలి ప్రేమ అనుభవాలు.. ట్రాన్స్ జెండర్ ప్రియాంక గురించి..?

priyanka
బిగ్ బాస్ కార్యక్రమంలో హౌజ్‌మేట్స్‌ని తమ తొలి ప్రేమ అనుభవాలు, జ్ఞాపకాలు షేర్ చేసుకోవాలని బిగ్ బాస్ తెలిపారు. ఈ క్రమంలో ఒకరి తర్వాత ఒకరు తమ తొలి ప్రేమ విషయాలు చెబుతూ కన్నీరు పెట్టించారు. సిరి హనుమంత్ తన పదో తరగతి లవ్ స్టోరీ చెబుతూ చాలా ఎమోషన్ అయింది. నేను విష్ణు అనే వ్యక్తిని ప్రేమించాను. అతను మా ఇంటికి ఎదురుగా ఉండేవాడు.
 
ఓరోజు తను నాకు ప్రపోజ్ చేశాడు.. తనంటే నాకూ ఇష్టమే కావడంతో ఎప్పుడెప్పుడు చెప్తాడా? అని నేనూ వెయిట్ చేసి.. చివరికి ఓకే చెప్పేశా. అయితే అతను నేను ఎవరితో అయిన మాట్లాడితే అస్సలు ఒప్పుకునే వాడు కాదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవ అయింది. ఆ టైంలోనే నాకు పెళ్లి సంబంధం వచ్చింది. అతని మీద కోపంతో ఒప్పుకున్నాను. రేపు ఎంగేజ్‌మెంట్‌ అనగా నా దగ్గరకు వచ్చి నా కాళ్లు పట్టుకుని ఏడ్చేశాడు. నాకు నువ్వు కావాలి, నువ్వు లేకుండా ఉండలేనంటూ నన్ను కన్విన్స్‌ చేశాడు.
 
అతనంటే కూడా నాకు చాలా ఇష్టం కాబట్టి తెల్లవారితే ఎంగేజ్‌మెంట్ కాబట్టి.. రాత్రికి రాత్రి అతనితో జంప్ అయ్యాను. కొద్ది రోజుల తర్వాత మా అమ్మ నాకు సర్ధి చెప్పి తీసుకొచ్చింది. కొన్నాళ్లు మేం ఇద్దరి మంచి రిలేషన్ షిప్‌లో ఉన్నాం. తర్వాత పలుమార్లు గొడవలు అయ్యాయి. ఓ రోజు ఉదయం 3 గంటలకు మెలుకువ వచ్చింది. మళ్లీ పడుకొని 8 గంటకు లేచా. అప్పుడు విష్ణు చనిపోయాడనే బ్యాడ్ న్యూస్ విన్నాను.
 
నాకు ఎప్పుడైతే మెలుకువ వచ్చిందో ఉదయం 3 గంటలకు అప్పుడే తను యాక్సిడెంట్‌కి గురై చనిపోయినట్టు తెలిసింది. తన కోసం నేను ఎంతో చేశా.. కానీ తనని ఆ దేవుడు నాకు ఇవ్వలేదు. తనని నేను మర్చిపోలేకపోతున్నా.. ఐ లవ్యూ విష్ణు' అంటూ సిరి చాలా ఎమోషనల్ అయింది.
 
అలాగే బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్ ప్రియాంక.. తన కన్నీటి ప్రేమ గాథను చెప్పి వెక్కివెక్కి ఏడ్చింది. 'అతని పేరు రవి.. అలా పిలవడం నాకు ఇష్టం లేక నేను ముద్దుగా అబ్బాయి అంటూ ఉంటా. ఓ ఫంక్షన్‌లో అతన్ని చూసి మనసు పడ్డాను.ఇద్దరం ఒకరినొకరం అర్ధం చేసుకున్నాం. ఆరేళ్లు రిలేషన్‌లో ఉన్నాం. తనంటే నాకు చాలా ఇష్టం.
 
మా సిస్టర్‌కి పెళ్లి అయ్యింది.. నా ఇబ్బందులు కూడా క్లియర్ అయ్యాయి.. అమ్మనాన్నల్ని నేను చూసుకోగలననే నమ్మకంతో నేను నా జెండర్‌ని ఛేంజ్ చేసుకున్నా.. అమ్మాయిగా మారిన తరువాత కొన్నాళ్ల పాటు అతనికి కనిపించలేదు. ఓ రోజు అతన్ని కలిసి నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పా. అతను ఓకే చెప్పి, ఇద్దరం రిలేషన్ షిప్‌లో ఉందాం అని అన్నాడు. నాకు తోడు దొరికిందని సంతోషపడ్డాను .
 
ఓ రోజు నా దగ్గరకు వచ్చి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని అన్నాడు. మరి నన్ను కూడా పెళ్లి చేసుకుంటా అన్నావ్ కదా అబ్బాయ్ అని అంటే.. నువ్ ఏమైనా అమ్మాయివా?? నీకు పిల్లలు పుడతారా? ఏం మాట్లాడుతున్నావ్‌? పెళ్లి ఏంటి పెళ్లి అని చిరాకు పడ్డాడు.. ఎందుకంటే నేను తల్లిని కాలేను. నీకు తెలుసో తెలియదో అబ్బాయ్.. నేను చాలా హాస్పటల్స్ తిరిగాను.. తల్లిని కావడం కోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టా.
 
అతను నాకు కావాలని ప్రాధేయపడ్డా. కాళ్ల మీద పడ్డాను.అయిన తను నన్ను వదిలేసి వెళ్లాడు. నువ్వు హ్యాపీగా ఉంటే చాలులే. ఓ రోజు అతను గుర్తొస్తుంటే ఇంటికి రా అని మెసేజ్ పెట్టా. అతను వచ్చి నన్ను చాలా బాధ పెట్టాడు. నువ్వు ఎవరో తెలుసా అంటూ అదే మాటను వందల సార్లు అని నన్ను హర్ట్ చేశాడు. నువ్ నన్ను ఇష్టపడినా పడకపోయినా నేను నిన్ను ఇష్టపడ్డా.
 
నువ్ ఒకటి గుర్తుపెట్టుకో.. నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ముందు ఈ పింకీ ఉంటుంది.. ఐ లవ్యూ.. ఐ మిస్ యూ. నీకు నా తరపున రిక్వెస్ట్ ఏంటంటే.. నువ్ మళ్లీ నా లైఫ్‌లోకి రావద్దు.. ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు' అని చాలా ఎమోషనల్ అయంది ప్రియాంక.