బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Dv
Last Updated : ఆదివారం, 20 నవంబరు 2016 (18:06 IST)

బెల్లంకొండ సాయి, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం..

భ‌ద్ర‌, తుల‌సి, సింహా, లెజెండ్‌, స‌రైనోడు వంటి సెన్సేష‌న‌ల్ హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తొలి చిత్రం అల్లుడు శీనుతో మాస్ హీరోగా తెలుగు సినిమాకు ప‌రిచ‌య‌మై త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున

భ‌ద్ర‌, తుల‌సి, సింహా, లెజెండ్‌, స‌రైనోడు వంటి సెన్సేష‌న‌ల్ హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తొలి చిత్రం అల్లుడు శీనుతో మాస్ హీరోగా తెలుగు సినిమాకు ప‌రిచ‌య‌మై త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్న‌ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థ‌నాయ‌కుడుగా  ద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ఫై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మాత‌గా  ప్రొడ‌క్ష‌న్ నెం.2  చిత్రం ఇటీవ‌ల లాంచ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. నవంబ‌ర్ 20 (నేటినుండి) రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకోనుంది. 
 
ఈ సంద‌ర్భంగా... చిత్ర నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ- మా ద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో బోయ‌పాటి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో సినిమా చేస్తుండ‌టం ఆనందంగా ఉంది.  డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో త‌న మార్కు ఎంట‌ర్‌టైన్మెంట్‌తో ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ కొత్త చిత్రాన్ని హై బ‌డ్జెట్‌తో రూపొందించ‌నున్నారు. 
 
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ స‌రికొత్త లుక్‌తో క‌నప‌డుతూ సాయి శ్రీనివాస్ పాత్ర స్ట‌ైలిష్‌గా, ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండేలా బోయ‌పాటి శ్రీను ప్లాన్ చేశారు. ఎం.ర‌త్నం ఈ చిత్రానికి మాట‌లు, రిషి పంజాబి సినిమాటోగ్ర‌ఫీ, రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

న‌వంబ‌ర్ 20 నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది. అందులో భాగంగా హీరో, హీరోయిన్ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను హైద‌రాబాద్‌లో షూట్ చేస్తున్నాం. క్వాలిటీ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా హై స్టాండ‌ర్డ్స్‌లో సినిమాను తెర‌కెక్కించేలా స‌న్నాహాలు చేస్తున్నామని తెలిపారు.