నకిలీ నోట్ల చెలామణి కేసు : కన్నడ నటి అరెస్టు
నకిలీ నోట్ల చెలామణి కేసులో కన్నడ నటి జయమ్మని బెంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. గురువారం కర్ణాటకలోని డాబస్‌పేటే పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ షాపు వద్దకు వచ్చి రూ.2 వేల నకిలీనోట్లు చెలామణి చేయడానికి ప్
నకిలీ నోట్ల చెలామణి కేసులో కన్నడ నటి జయమ్మని బెంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. గురువారం కర్ణాటకలోని డాబస్‌పేటే పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ షాపు వద్దకు వచ్చి రూ.2 వేల నకిలీనోట్లు చెలామణి చేయడానికి ప్రయత్నించగా, అనుమానం వచ్చిన షాపు యజమాని ఆమెను ప్రశ్నించగా ఆమె అక్కడి నుంచి పారిపోవాలని చూసింది. దీంతో ఆయనతో పాటు స్థానికులు ఆమెను వెంబడించి పట్టుకున్నాడు. ఆమె వద్ద భారీగా నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు.
ఆమెపై వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆ నటితో పాటు ఆమెకు సహకరిస్తున్న ఆటోడ్రైవరు గోవిందరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారు మాత్రమే కాదు నిర్మాతలు, కొందరు నటులు కూడా నకిలీనోట్లు చెలామణికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జయమ్మ సెల్‌ఫోన్ ఆధారంగా ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించారు.