ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 జులై 2017 (13:23 IST)

బిగ్ బాస్ రైజా క్లబ్‌లో ఎలా చిందేసిందో చూడండి (Video)

తమిళ బిగ్ బాస్‌ పార్టిసిపెంట్, వీఐపీ-2లో కాజోల్ పీఏగా నటించిన రైజా ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. రైజా క్లబ్‌లో చిందేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దక్షిణాదిన బిగ్ బాస్ షోనే చర్చన

తమిళ బిగ్ బాస్‌ పార్టిసిపెంట్, వీఐపీ-2లో కాజోల్ పీఏగా నటించిన రైజా ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. రైజా క్లబ్‌లో చిందేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దక్షిణాదిన బిగ్ బాస్ షోనే చర్చనీయాంశమైంది. తమిళ బిగ్ బాస్ ద్వారా నటి ఓవియా సోషల్ మీడియా ముద్దుబిడ్డగా మారిపోయింది. ఆమెకు మద్దతిచ్చే నెటిజన్ల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది.
 
సినీ లెజెండ్ కమల్ హాసన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షో రేటింగ్ తగ్గుతున్నా.. పార్టిసిపెంట్స్ లొల్లి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇంకా ఈ షోలో పాల్గొనే వారిపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో రైజా బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అవుతోంది.  వీఐపీ-2లోనూ రైజా ఫోటోలూ లీక్ అయ్యాయి. ప్రస్తుతం రైజా బెంగళూరులోని ఓ క్లబ్‌లో డ్యాన్స్ చేసే వీడియో విడుదలైంది. ఆ వీడియో మీకోసం..