శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (21:53 IST)

బిగ్ బాస్ హౌస్‌లో గంగవ్వకు ఏమైంది..? (video)

యు ట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు దగ్గరై చివరకు బిగ్ బాస్ సీజన్ 4లో చోటు సంపాదించుకుంది గంగవ్వ. ఇప్పుడు బిగ్ బాగ్ షోలో ఆమే స్పెషల్ అట్రాక్షన్. అయితే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాయి.
 
ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే గంగవ్వను ఎలిమినేట్ చేస్తే అభిమానులందరూ కలిసి ఆమెకు మద్ధతుగా నిలిచారు. కానీ బిగ్ బాస్ షోలో ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం అందరినీ ఆలోచనకు గురిచేసేలా ఉన్నాయి. 
 
నా భర్త తాగుడుకు బానిస. తాగొచ్చి నన్ను కొడుతూ ఉంటాడు. అందరూ హౌస్‌లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నాకు మాత్రం ఏదో వెలితిగా ఉంది. నేను ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండలేకపోవచ్చు. అయితే నాకు చాలామంది అండగా నిలుస్తున్నారు.
 
వారందరికీ నా ధన్యవాదాలు చెబుతున్నాను. నాగార్జున సన్ నాకు రెండో అన్న అంటూ ఆప్యాయంగా పిలుస్తూ పాటపాడింది. కట్టప్ప గురించి చెప్పాలంటూ అందరూ ర్యాప్ సాంగ్ పాడితే ఆమె చెవులు గిల్లుమంటున్నాయని చెప్పుకొచ్చింది. దీంతో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.