శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2023 (18:30 IST)

బిగ్‏బాస్ సీజన్-7కు శుభం కార్డు.. అర్జున్ అంబటి అవుటా?

Arjun Ambati
Arjun Ambati
బిగ్‏బాస్ సీజన్-7కు శుభం కార్డు పడనుంది. మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనలిస్ట్స్‌గా మారారు.  అమర్, శివాజీ, ప్రశాంత్, యావర్, అర్జున్, ప్రియాంక టాప్ 6 ఫైనలిస్ట్స్‌గా నిలిచారు. డిసెంబర్ 17న ఈ సీజన్ విన్నర్ ఎవరనేది తెలియనుంది. 
 
అయితే ఎప్పుడూ గ్రాండ్ ఫినాలేకు కేవలం ఐదుగురు ఫైనలిస్స్ మాత్రమే ఉంటారు. కానీ ఈసారి ఆరుగురు ఉన్నారు. దీంతో ఎలిమినేషన్ వుంటుందని టాక్. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. అర్జున్ అంబటి ఫస్ట్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. 
 
అయితే ఈ గ్రాండ్ ఫినాలే స్టేజ్‌పై యాంకర్ సుమ, తనయుడు రోషన్, మాస్ మాహారాజా రవితేజ సందడి చేయనున్నట్లు సమాచారం. అలాగే ఈ ఫినాలేకు ముఖ్య అతిథిగా మహేష్ బాబు రానున్నట్లు టాక్ వినిపిస్తుంది.