శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2023 (19:43 IST)

పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ వాసంతి ఎంగేజ్‌మెంట్

vasanthi
vasanthi
బిగ్ బాస్ బ్యూటీ, బుట్టబొమ్మ వాసంతి, నటుడు పవన్ కల్యాణ్‌ నిశ్చితార్థ వేడుక అట్టహాసంగా జరిగింది. పవన్ కళ్యాణ్ వాసంతి ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. గురువారం జరిగిన ఈ వేడుకలో బిగ్ బాస్ కంటిస్టెంట్లు హాజరయ్యారు. 
 
రియల్ లైఫ్‌లో పవన్ కళ్యాణ్‌ని పెళ్లాడిన వాసంతి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని కావడం విశేషం. పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే.. జనసేన పార్టీలో చేరి తిరుపతి నుంచి పోటీ చేస్తానని గతంలో తన మనసులో మాట చెప్పింది వాసంతి. వాసంతిని చేసుకుంటోన్న పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌లో అవకాశాల కోసం బాగానే ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.