శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 జులై 2023 (17:26 IST)

బిగ్ బాస్ ఏడో సీజన్.. ప్రోమో రిలీజ్

BB7
BB7
వివాదాస్పద రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా, త్వరలో ఏడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి మరోసారి నాగార్జున ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. బిగ్ బాస్ 7 తెలుగు తాజా ప్రోమోతో ఈ విషయం మరోసారి స్పష్టమైంది. 
 
రియాలిటీ షో బిగ్ బాస్ 7 తెలుగు కొత్త సీజన్‌కు సంబంధించి స్టార్ మా జూలై 18 రాత్రి కొత్త ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో నాగార్జున స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. హెయిర్ స్టైల్ డిఫరెంట్‌గా ఉండడంతో పాటు గడ్డం కూడా పెంచాడు. 
 
ఈ కొత్త సీజన్ గురించి అతని ప్రకటన, స్టార్ మా సృష్టించిన హైప్ కూడా భిన్నంగా ఉంది. ఈ ప్రోమో ద్వారా, స్టార్ మా బిగ్ బాస్ షో ఈసారి పూర్తిగా భిన్నంగా ఉండబోతోందనే హింట్ ఇచ్చింది. బిగ్ బాస్ కొత్త సీజన్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.