శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 జులై 2023 (16:19 IST)

సుదీప్ కొత్త సినిమా టీజర్ అదుర్స్... వీడియో

Sudeep
Sudeep
సుదీప్ కొత్త సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ వచ్చేసింది. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మేరకు "కే46 డెమోన్‌ వార్‌ బిగిన్స్‌"అంటూ ఓ పవర్‌ ఫుల్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ వీడియోలో సుదీప్ ఎంట్రీ బాగుంది. 
 
ఓ బస్సులో బుల్లెట్‌ గాయాలతో సుదీప్ కనిపిస్తాడు. ఆపై తనకి తానే ఒంట్లో నుంచి బుల్లెట్స్‌ తీసుకుంటూ కనిపించాడు. టీజర్‌ చివర్లో సుదీప్‌ చెప్పే డైలాగ్‌ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. 
 
ఈ మూవీకి అజనీష్‌ లోకనాథ్‌ సంగీతం అందిస్తున్నాడు. వి క్రియేషన్స్‌తో కలిపి సుదీప్‌ నిర్మిస్తున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.