శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 3 జులై 2023 (13:06 IST)

దర్శకుల చేతిలో నాలా మోసపోవద్దు: నిర్మాత అనిల్‌ సుంకర సెన్సేషనల్ కామెంట్

Producer Anil Sunkara,
Producer Anil Sunkara,
సినిమాకు దర్శక నిర్మాతలు భార్యభర్తలులాంటివారు అంటారు. ఒక్కోసారి బెడిసికొడితే సినిమా ఆగిపోతుంది కూడా. అయితే దర్శకులను నమ్మి చాలామంది నిర్మాతలు పెట్టుబడి పెడుతుంటారు. దర్శకుడు  ఓ లైన్‌ నిర్మాతలకు చెప్పడం, పెద్ద హీరో చేస్తున్నారని అనడంతో నిర్మాత ముందుకు వస్తాడు. అలా వచ్చి బోర్లాపడిన సందర్భాలు చాలానే వున్నాయి. తాజాగా అఖిల్‌ అక్కినేనితో అనిల్‌ సుంకర తీసిన ఏజెంట్‌ సినిమా అటువంటిదే. ఆ సినిమా మొదటిషో తర్వాత నిర్మాత సోషల్‌మీడియాలో ఓ ట్వీట్‌ చేశాడు. సినిమా అంతా దర్శకుడిదే తప్పు. సరైన కథ, కథనం లేకుండా సినిమా తీశాడని ఎద్దేవా చేశారు. అందుకే ఇకపై నాలా ఎవరూ నిర్మాతలు మోసకూడదని అలాంటి స్టేట్‌మెంట్‌ ఇచ్చానని నిర్మాత అనిల్‌ సుంకర తెలిపారు.
 
అసలేం జరిగిందంటే, సినిమా కథను దర్శకుడు సురేంద్ర రెడ్డి లైన్‌లో చెప్పాడు. బౌండ్‌ స్క్రిప్ట్‌ ఇవ్వలేదు. మొదటి వర్షన్‌ చెప్పాడు. తర్వాత కరోనా రావడం ఆ తర్వాత కొన్ని పరిణామాలవల్ల పూర్తికథ అతనూ తయారుచేయలేదు. ఇదంతా  దర్శకుడు తప్పిదమే. ఇకనుంచి నా దగ్గరకు వచ్చే దర్శకులంతా బౌండ్‌ స్క్రిప్ట్‌తో రావాలని సూచించారు. ప్రతివారికి ఈ విషయం చెప్పడం టైం వేస్ట్‌ కనుక ఇలా సోషల్‌మీడియా ద్వారా తెలియజేశానని అనిల్‌ సుంకర అన్నారు.