సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 నవంబరు 2023 (15:21 IST)

జబర్దస్త్ కామెడీ షోకు కొత్త యాంకర్.. ఎవరో తెలుసా?

Jabardasth
Jabardasth
జబర్దస్త్ కామెడీ షోకు కొత్త యాంకర్ వచ్చింది. జబర్దస్త్‌కు అనసూయ, ఎక్స్ ట్రా జబర్దస్త్‌కు రష్మీ యాంకరింగ్ చేశారు. వీరిద్దరూ ఈ షోల్లో చాలా సక్సెస్ అయ్యారు. మంచి పాపులర్ అయ్యారు. ఈ షో నుంచి ప్రస్తుతం అనసూయ తప్పుకుంది. ఆ స్థానంలో సౌమ్య రావు వచ్చారు. ఇప్పుడు సౌమ్య కూడా జబర్దస్త్‌ నుంచి వైదొలిగినట్టు తెలుస్తోంది. 
 
జబర్దస్త్ షోకు తాజాగా సౌమ్య రావు గుడ్‍బై చెప్పినట్టు సమాచారం. జబర్దస్త్ షోకు కొత్త యాంకర్‌గా యూట్యూబ్ సెన్సేషన్, బిగ్‍బాస్ ఫేమ్ సిరి హన్మంత్ వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది. నవంబర్ 9వ తేదీ జబర్దస్త్ ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమోను ఈటీవీ రిలీజ్ చేసింది.