శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By preethi
Last Updated : శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (11:17 IST)

ఫినాలెకి చేరుకున్న మొదటి కంటెస్టెంట్.. అంతా గుడ్డు మాయ

గురువారం బిగ్ బాస్ ఎపిసోడ్‌పై భారీగానే ఉత్కంఠ నెలకొంది. దీనికి కారణం రోల్ అండ్ సామ్రాట్ మధ్య పోటీ జరగనుంది. అందులో గెలిచినవారు డైరెక్ట్‌గా ఫినాలెకి వెళ్లే ఛాన్స్ కొట్టేస్తారు. మీ ఇసుక జాగ్రత్త టాస్క్

గురువారం బిగ్ బాస్ ఎపిసోడ్‌పై భారీగానే ఉత్కంఠ నెలకొంది. దీనికి కారణం రోల్ అండ్ సామ్రాట్ మధ్య పోటీ జరగనుంది. అందులో గెలిచినవారు డైరెక్ట్‌గా ఫినాలెకి వెళ్లే ఛాన్స్ కొట్టేస్తారు. మీ ఇసుక జాగ్రత్త టాస్క్ రెండు విడతలలో విజేతలుగా నిలిచిన రోల్ అండ్ సామ్రాట్ మధ్య నిన్న "మీ గుడ్డు జాగ్రత్త" టాస్క్ పెట్టారు. దీని ప్రకారం ఇద్దరికీ చెరో బౌల్‌లో గుడ్లను ఇచ్చి వాటిని కాపాడుకోమన్నారు. మిగిలిన హౌస్‌మేట్స్ వాటిని పగలగొట్టాలి. టాస్క్ ముగింపులో ఎవరి గుడ్లు అయితే పగలకుండా ఉంటాయో వారే విజేతలు.
 
అయితే సామ్రాట్‌కి హౌస్‌లో గీత, దీప్తి, తనీష్‌లు మద్దతు తెలుపగా ఒంటరిగా ఉన్న రోల్‌కు మద్దతుగా నిలిచాడు కౌషల్. రోల్ చాలాసేపు గుడ్లను కాపాడుకుంటూ కిచెన్‌లోని కప్‌బోర్డ్‌లో దాక్కుని ఉండగా బయట కౌషల్ అతనికి కాపలాగా నిలబడ్డాడు. అయితే బిగ్ బాస్ గేమ్‌ను బయటకు వచ్చిన ఆడాలని ఆదేశించగా బయటికి వస్తున్నప్పుడు తనీష్, దీప్తి, గీతలు దాడి చేయగా గుడ్లు కిందపడి పగిలిపోయాయి. 
 
ఇక రోల్ రైడా గుడ్లు కింద పడిపోవడంతో కౌషల్ సామ్రాట్ గుడ్లను పగలగొట్టేందుకు చాలా ప్రయత్నించాడు. కానీ మిగిలిన సభ్యులు అండగా నిలవడంతో పాటుగా ఎలాగూ తన గుడ్లు పగిలిపోయాయి, కనీసం సామ్రాట్ అయినా ఫినాలెకి వెళ్లనిద్దాం అనుకున్నాడో ఏమో రోల్ కూడా మద్దతు పలికేసాడు. దీంతో కోపం వచ్చిన కౌషల్ ఇప్పటి వరకు నీకు అండగా నిలబడి అంత మందితో పోరాడితే చివర్లో నువ్ పోరాడకుండా సామ్రాట్‌కి మద్దతు తెలపడం ఏంటి అంటూ కౌశల్ ప్రశ్నించాడు.
 
మిగిలిన సభ్యుల సంగతి వదిలెయ్, నీకు సామ్రాట్ గెలవాలని ఉందా అని అడిగినప్పుడు అవుననడంతో గేమ్‌ని వదిలేశాడు కౌశల్. దీంతో సామ్రాట్ బెర్త్ కన్ఫామ్ అయిపోయింది. తన పట్ల చూపిన మద్దతుకు సామ్రాట్ ఎంతో పొంగిపోయి కన్నీటి పర్యంతం అయ్యాడు.