సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2020 (20:46 IST)

బిగ్ బాస్ నాలుగో సీజన్.. మూడో రోజు కట్టప్ప ఎవరు? గంగవ్వ చెప్పేసిందిగా..?!

బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే కంటెస్టెంట్లు అందరూ హౌజ్‌లో అడుగుపెట్టారు. మొదటి రోజు గొడవలతో గడిచినా.. రెండో రోజు మాత్రం కాస్త వినోదాన్ని పంచేందుకు ప్రయత్నించారు. ఇక మూడో రోజు కట్టప్ప ఎవరు.? అనే ప్రశ్నతో ఎపిసోడ్ షురూ అయినా దానికి సమాధానం మాత్రం దొరకలేదు.
 
బిగ్ బాస్ హౌస్‌లో కళ్యాణి టీచర్‌గా తన పాత్రలో ఒదిగిపోయింది. అయితే గంగవ్వ 50 ఏండ్లుగా ఇదే స్కూల్‌లో టీచర్ పంచ్ వేస్తే.. జీతం తీసుకుని ఫెయిల్ చేస్తున్నవ్ అని గంగవ్వ రివర్స్ పంచ్ వేస్తూ.. స్కూలును పిచ్చాసుపత్రిలా చేస్తున్నవ్ అని గంగవ్వ అనడంతో బిగ్ బాస్ హౌస్‌లో అంతా నవ్వుల్లో మునిగితేలారు.
 
కట్టప్ప ఎవరా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న కంటెస్టెంట్లను బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ఈ మనసులో ఎవరినీ కట్టప్పగా అనుకుంటాన్నారో వారి పేర్లను ఓ డబ్బాలో వేయాలని సభ్యులందరికీ సూచించాడు. దీంతో కరాటే కళ్యాణి, అమ్మరాజశేఖర్, సూర్యకిరణ్‌, సుజాత, గంగవ్వ..అఖిల్ పేరును రాయగా, దేవి నాగవల్లి, అఖిల్‌, నోయల్, హారిక, లాస్య సూర్యకిరణ్ పేరును, దివి, మెహబూబ్‌, లాస్య, అభిజిత్‌, మోనాల్ పేరును, అమ్మ రాజశేఖర్‌, నోయల్ మెహబూబ్‌ పేర్లను రాశారు. మరోవైపు అఖిలే కట్టప్ప అవుతాడని గంగవ్వ ముఖం మీదే చెప్పేసింది. అందరం అఖిల్ పేరు రాసినమని చెప్పుకొచ్చింది గంగవ్వ.
 
మూడో రోజు మొదటి లగ్జరీ బడ్జెట్ జరుగగా.. అమ్మరాజశేఖర్ టాస్క్‌కు సంచాలకులుగా వ్యవహరించారు. అయితే టాస్క్ జరుగుతున్నపుడు అమ్మరాజశేఖర్ ఎవరూ తప్పు చేయకుండా చూడాల్సింది పోయి, వంటగదిలోకి ప్రవేశించి పని చేసుకోవడం కొసమెరుపు. మరోవైపు కంటెస్టెంట్స్ చిత్రలేఖనంతో తమ నైపుణ్యాన్ని వెలికితీశారు. అయినా ఇంటి సభ్యులు మాత్రం కేవలం 5 పాయింట్లు మాత్రమే సాధించుకున్నారు. ఇదిలా ఉంటే పక్కింటివాళ్లకు భోజనం పంపమని కంటెస్టెంట్ ఖరాఖండిగా చెప్పడంతో అరియానా, సోహైల్‌కు ఉపవాసం ఉండక తప్పలేదు.