ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (13:52 IST)

కాజల్ పారితోషికం ఎంత? సన్నీనే బిబి-5 విన్నరా? బాస్ హింట్ ఇచ్చేశారా?

bigg boss
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే అత్యంత ఘనంగా ఉంటుందని టాక్ వస్తోంది. ఫినాలేకు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బిగ్‌బాస్ హౌస్‌లో గత వారం అంటే 14వ వారం కాజల్ హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. అందరికీ వాగ్వివాదానికి దిగే కాజల్.. మానస్, సన్నీలతో మంచి స్నేహబంధం ఏర్పర్చుకుంది. 
 
ఎంతలా ఉంటే సన్నీకు ఎవిక్షన్ పాస్ రావడానికి కారణమైంది. తనతో కనెక్ట్ అయినవారి కోసం ఎందాకైనా వెళ్లే కాజల్ స్వభావం అభిమానుల్ని ఆకట్టుకుంది. బిగ్‌బాస్‌లో 14 వారాల వరకూ కొనసాగింది. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని భావించిన యాంకర్ సన్నీ కంటే ఎక్కువ ఓట్లు రాబట్టుకోగలిగింది.
 
ప్రస్తుతం కాజల్ ఎలిమినేషన్ అయ్యాక ఆమె తీసుకున్న పారితోషికంపైన చర్చ సాగుతోంది.  కంటెస్టెంట్ స్థాయిని, పాపులారిటీని బట్టి ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం వారానికి ఇంత చొప్పున కంటెస్టెంట్లకు పారితోషికం ఉంటుంది. 
 
సోషల్ మీడియాలో విన్పిస్తున్న ప్రచారం ప్రకారం కాజల్‌కు వారానికి 2 లక్షలకు పైనే చెల్లించినట్టు సమాచారం. కాజల్ బిగ్‌బాస్ హౌస్‌లో మొత్తం 14 వారాలు ఉంది. అంటే మొత్తం 30 లక్షల రూపాయల వరకూ పారితోషికం అందినట్టు తెలుస్తోంది. 
 
సోమవారం నాటి ఎపిసోడ్‌లో శ్రీరామ్, మానస్‌ల ఎమోషనల్ జర్నీని చూపించారు. ఇక నేటి ఎపిసోడ్‌లో షణ్ముఖ్, సన్నీల జర్నీలకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. సన్నీ తన పోస్టర్స్ చూసుకుని ఫుల్ ఫన్ జనరేట్ చేస్తున్నాడు. 
 
బిగ్ బాస్ సన్నీ జర్నీని అద్భుతంగా విశ్లేషించారు. ‘సరదా సన్నీ ఒకే అక్షరంతో మొదలౌతాయని.. మీరు గుర్తు చేశారు. గెలిచిన ఆటలు.. జరిగిన గొడవలు.. మోసిన నిందలు.. చేసిన వినోదం.. ఎన్ని ఒడుదుడుగులు వచ్చినా అందరి మొహంపైనవ్వు తీసుకుని వచ్చి ఎంటర్ టైనర్‌గా అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఒంటరిగా వచ్చిన మనిషికి కొంచెం ప్రేమను సంపాదించుకోవడం కంటే పెద్ద విజయం ఏదీ లేదని మీరు సాధించిన విజయమే మీకు గుర్తు చేస్తుంది.
 
అప్నా టైం ఆయేగా.. సన్నీ మీ సమయం వచ్చేసింది’ అని అన్నారు బిగ్ బాస్. అప్నా టైం ఆయేగా.. అనేది సన్నీ పదే పదే అంటుంటారు.. ఇప్పుడు బిగ్ బాస్ కూడా అప్నా టైం ఆయేగా.. అంటూ సన్నీ టైం వచ్చేసింది అని అన్నారంటే.. బిగ్ బాస్ సీజన్ 5 విజేత అతనే అని హింట్ ఇచ్చేశారా? అనే అనుమానాలు మొదలయ్యాయి.