గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శుక్రవారం, 10 డిశెంబరు 2021 (16:06 IST)

బిగ్ బాస్‌లో టాప్ అతడేనా.. కానీ గెలుపు మాత్రం?

బిగ్ బాస్ 5వ సీజన్ సృష్టిస్తున్న హంగామా అంతాఇంతా కాదు. ఇప్పటి వరకు 13 వారాలకు పదమూడు మంది సభ్యులు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అందులో ముఖ్యంగా ఫస్ట్ వారం సరయు, రెండో వారం దేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నాగరాజు, ఐదోవారం హమీదా, 6వ వారం శ్వేత, ఏడవ వారం ప్రియ, ఎనిమిదవ వారం లోబో, 9వ వారం విశ్వ.

 
ఆ తరువాత ఆనీ, రవి, ప్రియాంక సింగ్‌లు ఎలిమనేట్ అయ్యారు. అయితే 11వ వారంలో జెస్సీ అనారోగ్యం తోనే హౌస్ నుంచి వెళ్ళిపోయారు. ఫినాలే ప్రస్తుతం చివరి దశలో ఉండటంతో ఎవరు గెలుస్తారన్నది మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

 
డిసెంబర్ 19వ తేదీన ఫినాలే జరుగబోతోంది. దీంతో రానురాను మరింత కష్టతరమైన, విచిత్రకరమైన టాస్క్‌లను ఇస్తున్నారు నిర్వాహకులు. అంతేకాదు కంటెన్టెంట్లు ఎన్నో సర్‌ప్రైజ్ ప్లాన్లు కూడా చేస్తున్నారు. దీంతో ఆట కాస్త మరింత ఆసక్తికరంగా మారిపోయింది. 

 
ఇప్పుడున్న ఆరుగురు కంటెస్టెంట్లలో ఎవరు టాప్ 5లో నిలుస్తారన్నదే ఆసక్తికరంగా మారుతోంది. ఇందులో ఎవరికి ఇష్టమొచ్చిన పేర్లు వాళ్ళే చెప్పేసుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే వీజీ. సన్నీ, జస్వంత్, షణ్ముక్‌లు ఉన్నారు. అయితే వీరిలో మొదటగా సన్నీనే నిలుస్తారన్న అభిప్రాయం అభిమానుల నుంచి వినిపిస్తోంది. సన్నీ చాలా బాగా ఆడుతున్నాడని.. అతనికి తిరుగే లేదని చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఫైనల్ మాత్రం ఎవరన్నది స్పష్టంగా చెప్పాలంటే మరికొన్నిరోజులు ఆగాల్సిందే.