శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (15:22 IST)

విమానాశ్రయాల్లో గట్టి నిఘా : ఢిల్లీలో నలుగురు విదేశీయులకు పాజిటివ్

దేశంలో ఒమిక్రాన్ వైరస్ భయం పుట్టిస్తుంది. దీంతో ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై గట్టి నిఘా సారించారు. ఎట్ - రిస్క్ జాబితాలో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఢిల్లీకి వచ్చిన నలుగురికి విదేశీయులకు కరోనా పాజిటివ్ అని తేలింది. 
 
వీరిని లోక్‌ నారాయణ్ జయప్రకాశ్ ఆస్పత్రిలో చేరి చికిత్స అందిస్తున్నారు. వారి నమూనాలను జీనీమ్ సీక్వెన్సింగ్‌ కోసం పంపించారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడు ఎయిర్‌పోర్టులో తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 
 
దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ఒమిక్రాన్ ముప్పుపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇందులో విమానాశ్రయాల్లో తీసుకోవాల్సిన పరీక్షలు, కరోనా పరీక్షలు, నిఘా కోసం తీసుకుంటున్న చర్యలు సమీక్షిస్తారు.