ఆదివారం, 3 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (11:30 IST)

శరవేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి : 25 దేశాల్లో కేసులు నమోదు

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ శవేగంగా వ్యాప్తిస్తుంది. ఇప్పటికే 25కు పైగా దేశాల్లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. తాజాగా నైజీరియాలో కూడా తొలి కేసు నమోదైంది. అలాగే, యూరోపియన్ యూనియన్‌లోని 11 దేశాల్లో ఏకంగా 44 కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా, ఎట్ రిస్క్ ఉన్న దేశాల నుంచి బుధవారం ఏకంగా 3476 భారత్‌లోకి అడుగుపెట్టారు. వీరికి పరీక్షలు చేయగా, ఆరుగురుకి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. దీంతో కేంద్రం ఎయిర్ పోర్టుల్లో అలెర్ట్ ప్రకటించింది.
 
అంతేకాకుండా, ఈ వైరస్ ఇప్పటివరకు 25 దేశాలకు పాకిపోయింది కొత్త వేరియంట్ గురించి ప్రపంచ దేశాలను దక్షిణాఫ్రికా అప్రమత్తం చేసింది. అక్టోబరులో తొలి కేసు సౌతాఫ్రికాలోనే వెలుగు చూసింది. సౌతాఫ్రికా నుంచి నైజీరియాకు వచ్చిన వారిలో ఒకరికి ఈ వైరస్ సోకినట్టు తేలిందని నైజీరియా జాతీయ ప్రజారోగ్య సంస్థ తెలిపింది. 
 
మరోవైపు, అత్యంత కఠిన ఆంక్షలు అమలయ్యే సౌదీ ఆరేబియాలో కూడా మరో కేసు నమోదైంది. ఇదిలావుంటే ఎట్ రిస్క్ దేశాల నుంచి భారత‌కు 3476 మంది వచ్చారు. వీరందరికీ నిర్వహించిన పరీక్షల్లో ఆరుగురికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. అయితే, వీరికి సోకింది ఒమిక్రానా? లేదా వేరే వేరియంటా? అనేది నిర్ధారణ కావాల్సివుంది.