గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 19 అక్టోబరు 2021 (17:06 IST)

సోనీ లైట్‍వెయిట్, అల్ట్రా-థిన్ డిజైన్‍తో ICD-TX660 వాయిస్ రికార్డర్

సోనీ ఇండియా ఈరోజు ICD-TX660తో తమ వాయిస్ రికార్డర్ రేంజ్‍కి ఒక కొత్త చేర్పును ప్రకటించింది. ఒక పుష్, ఆటో వాయిస్ రికార్డింగ్‍తో TX660 హై క్వాలిటీ ఇంకా రిలయబుల్ రికార్డింగ్ అందిస్తుంది. దీని మెరుగైన ఫీచర్లు ఇంకా ప్రీమియం డిజైన్ అనేవి ప్రయాణంలో రికార్డింగ్ కోసం మీ జేబులో తీసుకెళ్లడానికి దీనిని అనువైన డివైస్‍గా చేస్తాయి.
 
1. ఎక్స్టెండెడ్ రికార్డింగ్ కోసం 16GB బిల్ట్-ఇన్ మెమరీ
ICD-TX660కి 16GB బిల్ట్-ఇన్ మెమరీ ఉంది, కాబట్టి మీ ఆడియో కోసం మీకు కావలసినంత స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. 5000 వరకు ప్రత్యేక ఫైల్స్ రికార్డ్ చేసి స్టోర్ చేసుకోండి.
 
2. ఉపయోగకరమైన కనెక్టివిటీ కోసం USB Type-C
సౌకర్యవంతమైన కనెక్టివిటీ కోసం ICD-TX660కి ఒక USB Type-C పోర్ట్ ఉంది.
 
3. పాకెట్‍లో కెట్‍లో తీసుకు వెళ్ళడానికి లైట్‍వెయిట్, అల్ట్రా-థిన్ డిజైన్‍
29 గ్రాముల లైట్‍వెయిట్ ఇంకా అల్ట్రా-థిన్ డిజైన్‍తో, ICD-TX660 మీ పాకెట్‍లోకి ఈజీగా ఫిట్ అవుతుంది, కాబట్టి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి అది వచ్చి ఒక్క క్షణంలో సిద్ధంగా ఉండగలదు. దీని ప్రీమియం అనుభూతి ఇంకా సొగసైన మెటాలిక్ బాడీ అనేవి ICD-TX660ని ఎంత ప్రాక్టికల్‍గా ఉంటుందో అంత స్టైలిష్‍గా చేస్తాయి.
 
4. 12 గంటలపాటు బిల్ట్-ఇన్ బ్యాటరీ లైఫ్
మీ మీటింగ్‍లు, లెక్చర్‍లు ఇంకా క్లాసులు అన్నింటి రికార్డింగ్ కోసం 12 గంటల బ్యాటరీ లైఫ్.
 
5. మెరుగైన డిజిటల్ స్టీరియో మైక్‍తో హై క్వాలిటీ రికార్డింగ్
వాయిస్ రికార్డర్ యొక్క మెరుగైన డిజిటల్ స్టీరియో మైక్ ఇప్పుడు మైక్రోఫోన్ సెన్సిటివిటీని వదలకుండా శబ్దాన్ని 50 % తగ్గిస్తుంది. పారాబాలిక్ ఫార్మ్ మౌంటింగ్ పార్ట్ (రెడ్ లైన్డ్ పార్ట్) ఇంకా మెరుగైన హై-క్వాలిటీ డిజిటల్ స్టీరియో మైక్ (స్కై బ్లూ పార్ట్)తో, దాని బాడీ సైజ్ కాంపాక్ట్‍గా ఉన్నప్పటికీ TX660 హై-క్వాలిటీ స్టీరియో రికార్డింగ్‍ను రికార్డ్ చేయగలదు.
 
6. మెరుగైన పెద్ద OLED స్క్రీన్ ఇంకా మరింత ప్రకాశవంతమైన REC LED
41% పెద్ద ఇంకా మెరుగైన OLED డిస్‍ప్లే‌తో, ఇది టెక్స్ట్ ని చదవడానికి స్పష్టంగా చేస్తుంది. మీరు మీ రికార్డింగ్‍లను ట్రాక్ చేసుకుని ఉంచుకోవచ్చు ఇంకా టెక్స్ట్ ని ఎప్పటికంటే సులభంగా చదవవచ్చు. ICD-TX660 కి ఒక ప్రకాశవంతమైన REC లైట్ ఉంది, దీనిని చెస్ట్ పాకెట్ లేదా బ్యాగ్‍లో పెట్టేటప్పుడు పై నుంచి రికార్డింగ్ స్టేటస్ LEDని చూడటం ఇది సులభతరం చేస్తుంది.
 
7. ఆటో వాయిస్ రికార్డింగ్‍తో బ్యాక్‍గ్రౌండ్ శబ్దాన్ని తగ్గించండి
ఆ డివైస్ ఆటోమేటిక్‍గా వాయిస్ కోసం మైక్ సెన్సిటివిటీని అడ్జస్ట్ చేస్తుంది ఇంకా వోకల్ ఫ్రీక్వెన్సీల కోసం ఆడియో క్యాప్చర్ సెట్టింగ్‍లను ఆప్టిమైజ్ చేసి బ్యాక్‍గ్రౌండ్ శబ్దాన్ని తగ్గిస్తుంది. దాని ఫలితం తక్కువ బ్యాక్‍గ్రౌండ్ శబ్దం ఇంకా సూట్ అవని మైక్రోఫోన్ సెట్టింగ్స్ వలన ఆడియో నష్టం జరిగే అవకాశం తక్కువగా చేసే మరింత స్వచ్ఛమైన రికార్డింగ్.
 
8. ధర మరియు లభ్యత
కొత్త ICD-TX660 వాయిస్ రికార్డ్ స్పీకర్ Sony రిటెయిల్ స్టోర్స్ , ప్రధాన ఎలెక్ట్రానిక్ స్టోర్స్ ఇంకా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ పోర్టల్ అన్నింటిలోనూ 27th సెప్టెంబర్ 2021 నుంచి అందుబాటులో ఉంది.