సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (12:07 IST)

పార్లమెంటులో అగ్నిప్రమాదం

భారత పార్లమెంటులో అగ్నిప్రమాదం చెలరేగింది. పార్లమెంటులోని రూమ్ నెంబర్ 59లో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన వెంటనే తాము అప్రమత్తమయ్యామని ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు.  
 
సమాచారం అందుకున్న వెంటనే ఓ అగ్నిమాపక బృందం త్వరగా సంఘటనస్థలానికి చేరుకుంది. వీరు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ఇంకా రాబోయే గంటల్లో అధికారిక వివరణ వెలువడుతుందని అందరూ భావిస్తున్నారు
 
పార్లమెంటు శీతాకాల సమావేశాలు క్రమంగా పురోగమిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. శీతాకాల సమావేశాలు నవంబర్ 29న ప్రారంభమయ్యాయి, ఇది డిసెంబర్03న ముగుస్తుంది.