లోబో దీపావళి అందుకే చేసుకోగలుగుతున్నాడట
బిగ్ బాస్ షోలో వచ్చిన వారందరూ బాగా సంపాదించుకుని వెళుతున్నారని అందరూ భావిస్తున్నారు. అది నిజమే అంటున్నారు నిర్వాహకులు. పెద్దగా అవకాశాలు లేకపోయినా బిగ్ బాస్ లోకి వచ్చిన తరువాత మాత్రం సంవత్సరం వరకు కూర్చుని తినేంత డబ్బులు మాత్రం సంపాదించుకుంటున్నారని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అందుకే పోటీలు పడి ఈ షోకు వెళుతున్నారట.
అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి లోబో. ఇతని పేరే వెరైటీగా ఉన్నా సోషల్ మీడియా వేదికగా ఇతను చేసిన స్కిట్లు ఇతన్ని బిగ్ బాస్ వైపు అడుగులు వేయించాయి. లోబో బిగ్ బాస్ షోకు వెళ్ళినప్పుడు బాగానే చేస్తున్నాడు. నవ్విస్తున్నాడు. చివరి వరకు వెళ్ళగలడని అందరూ భావించారు.
నాగార్జున కూడా అదేస్థాయిలో సపోర్ట్ కూడా చేశారు. తాను బస్తీ నుంచి వచ్చానని.. తనను ఆదరించాలని కూడా చెప్పడంతో అతనిపై సానుభూతి పెరిగి చాలారోజుల పాటు షో అయితే చేశాడు.
అయితే తాజాగా లోబో వ్యవహారం ఎందుకు వచ్చిందంటే దీపావళి కావడంతో లోబో కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేశారట. ప్రస్తుతం నేను కుటుంబంతో కలిసి దీపావళి చేసుకుంటున్నానంటే అందుకు కారణం బిగ్ బాస్ షోనే. అందులో సంపాదించుకున్నాను కాబట్టే ఇప్పుడు పండుగ చేసుకోగలుగుతున్నాను.
నా చేతిలో ఇంతకుముందు డబ్బులు లేవు. బిగ్ బాస్ పుణ్యమా అంటూ డబ్బులు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను. పదిమందిని నవ్వించడం కాదు నేను కూడా ఆనందంగా ఉండాలంటే డబ్బులు ఉండాలి కదా అంటున్నాడట లోబో.