ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: శనివారం, 15 సెప్టెంబరు 2018 (16:22 IST)

బిత్తిరి సత్తి హీరోగా ‘తుపాకీ రాముడు’

పాపులర్ యాంకర్, నటుడు బిత్తిరిసత్తి కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘తుపాకీ రాముడు’. ‘బతుకమ్మ’ ఫేమ్, సీనియర్ దర్శకులు టి. ప్రభాకర్ దర్శకత్వంలో రసమయి ఫిల్మ్స్ పతాకంపై రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి

పాపులర్ యాంకర్, నటుడు బిత్తిరిసత్తి కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘తుపాకీ రాముడు’. ‘బతుకమ్మ’ ఫేమ్, సీనియర్ దర్శకులు టి. ప్రభాకర్ దర్శకత్వంలో రసమయి ఫిల్మ్స్ పతాకంపై రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తిచేసుకుని, శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్‌, ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. ‘‘బిత్తిరి సత్తిగా అందరికీ పరిచయమైన సత్తి.. తుపాకీ రాముడు చిత్రంలో మరో కోణంలో కనిపిస్తున్నారు. ఈ సినిమా సత్తికి మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే దర్శకుడు ప్రభాకర్‌గారు నాకు పరిచయమైన తొలి దర్శకుడు. సీనియర్ దర్శకుడైన ప్రభాకర్‌గారు ఈ చిత్రాన్ని ఎంతో వినోదాత్మకంగా తెరకెక్కించి ఉంటారని ఆశిస్తున్నాను. ఈ చిత్రం అందరికీ మంచి పేరు, సక్సెస్‌ని ఇవ్వాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.
 
చిత్ర దర్శకుడు టి. ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు పుష్కలంగా ఉంటాయి. బిత్తిరిసత్తిని ఈ చిత్రంలో వైవిధ్య కోణంలో చూపిస్తున్నాము. రసమయి బాలకిషన్‌గారు కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాకి సహకరించారు. పూర్తి వినోదాత్మకంగా ఉండబోతోన్న ఈ చిత్రం ప్రేక్షకులందరినీ తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుంది..’’ అని అన్నారు.
 
నిర్మాత రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. ‘‘సత్తిని మా బ్యానర్‌లో హీరోగా పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రేక్షకులని ఈ చిత్రం చక్కగా ఎంటర్‌టైన్ చేస్తుంది. సినిమా అంతా ఎంతో వినోదాత్మకంగా ఉంటుంది. ఈ చిత్రం సత్తికి మంచి పేరునే కాకుండా బిజీ నటుడిని కూడా చేస్తుంది. ఇంకా రెండు పాటలు చిత్రీకరణ జరపాల్సి ఉంది. నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా దాదాపు చివరికి వచ్చాయి. త్వరలోనే ఇతర వివరాలను ప్రకటిస్తాము..’’ అన్నారు.
 
బిత్తిరిసత్తి, ప్రియ, ఆర్.ఎస్. నందా, గౌతంరాజు, రవి ఆదేష్, అంబటి వెంకన్న, అనురాగ్, పోశం, మాధవి, గాయత్రి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సురేందర్ రెడ్డి, మాటలు: సిద్దార్ధ, రవి ఆదేష్, ఎడిటింగ్: జె.పి., పాటలు: అభినయ శ్రీనివాస్, మిట్టపల్లి సురేందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: మక్కపాటి చంద్రశేఖర్‌రావు, మక్బుల్ హుస్సేన్, నిర్మాత: రసమయి బాలకిషన్; రచన-సంగీతం-దర్శకత్వం: టి. ప్రభాకర్.