మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 14 మే 2018 (10:47 IST)

ఇసుక తుఫాను బీభత్సం.. ఆ నటికి రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం

ఉత్తర భారతదేశాన్ని ఇసుకు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాను కారణంగా ఇప్పటికే దాదాపు 100 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆదివారం మరోమారు ఈ తుఫాను బీభత్సం సృష్టించింది.

ఉత్తర భారతదేశాన్ని ఇసుకు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాను కారణంగా ఇప్పటికే దాదాపు 100 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆదివారం మరోమారు ఈ తుఫాను బీభత్సం సృష్టించింది. ఇందులో చిక్కున్న బాలీవుడ్ నటి హేమమాలినికి రెప్పపాటులో ప్రాణాపాయం తప్పింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
ఆమె ఆదివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో పర్యటిస్తున్న సమయంలో ఓ పెద్ద చెట్టు ఆమె కాన్వాయ్ ముందు కూలిపోయింది. మధుర దగ్గర్లోని మిథౌలి గ్రామంలో ఓ సమావేశంలో పాల్గొనడానికి హేమమాలిని వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 
 
ఆదివారం యూపీ, ఢిల్లీ ప్రాంతాలు ఈదురుగాలులు, భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి. ఇదేసమయంలో సమావేశం కోసం మధుర వెళ్లారు హేమామాలిని. ఆమె కాన్వాయ్ వెళ్తుండగానే సడెన్‌‌గా పెద్ద చెట్టు రోడ్డుపై కూలింది. రెప్పపాటు సమయంలో డ్రైవర్ చాకచక్యంగా కారును కంట్రోల్ చేశాడు. దీంతో హేమమాలినికి పెద్ద ప్రమాదం తప్పింది.