శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 21 ఏప్రియల్ 2018 (18:21 IST)

రేప్ కేసులకు మీడియాలో అధిక పబ్లిసిటీ ఇస్తున్నారు : హేమమాలిని

దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలపై బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేప్ కేసులకు మీడియాలో అధిక పబ్లిసిటీ ఇస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. కేవలం పబ్లిసిటీ కోసమే అలాంటి కేసుల

దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలపై బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేప్ కేసులకు మీడియాలో అధిక పబ్లిసిటీ ఇస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. కేవలం పబ్లిసిటీ కోసమే అలాంటి కేసులను లేవనెత్తుతున్నారనిఆరోపించారు.
 
ఆమె మథురలో విలేకరులతో మాట్లాడుతూ, 'నేటి రోజుల్లో అలాంటి కేసులకు ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నారు. ఇలాంటి గతంలో అనేకం జరిగినప్పటికీ... వాటిని గురించి బయటికి తెలియలేదు. ప్రభుత్వం వీటిపై ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుని తగిన పరిష్కారంతో ముందుకెళుతుంది...' అని హేమమాలిని వ్యాఖ్యానించారు. 
 
ఇదిలావుంటే, 12 యేళ్ల బాలికలపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణదండన విధించేలా కేంద్ర మంత్రివర్గం శనివారం ఓ ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసిన తర్వాత ఆర్డినెన్స్‌ ముసాయిదాను కేంద్రం తయారు చేయనుంది.