గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 13 జనవరి 2018 (12:45 IST)

హేమమాలిని ఇంటి ముందు చిరుత.. అదేదో కుక్క అనుకుంటే?

అలనాటి సినీ నటి, ప్రస్తుత బీజేపీ ఎంపీ హేమమాలిని ఇంటి వద్ద చిరుత పులి కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. గుర్గావ్‌లోకి ఓ చిరుతపులి ప్రవేశించింది. ఈ పులి హేమమాలిని ఇంటిముందు కాపలా కాస్తున్న గార్డు

అలనాటి సినీ నటి, ప్రస్తుత బీజేపీ ఎంపీ హేమమాలిని ఇంటి వద్ద చిరుత పులి కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. గుర్గావ్‌లోకి ఓ చిరుతపులి ప్రవేశించింది. ఈ పులి హేమమాలిని ఇంటిముందు కాపలా కాస్తున్న గార్డు ముందుకు వచ్చింది. ఇదేదో కుక్కలా వుందని భావించిన అతను లాఠీ తీసుకుని దాన్ని అదిలించబోయాడు అంతే అసలు సంగతి తెలుసుకుని జడుసుకున్నాడు. 
 
చిరుత అని తెలుసుకుని పరుగులు తీస్తూ, చుట్టు పక్కల వారికి విషయం చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న హేమమాలిని అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖాధికారులు చిరుతను పట్టుకోవాలని ప్రయత్నించారు. కానీ అది చిక్కకుండా పారిపోయింది. ఇక చేసేది లేక చిరుత కనిపిస్తే.. కామ్‌గా వుండిపోండని.. వాటిని తరిమేందుకు, పట్టుకునేందుకు ప్రయత్నిస్తే ఎదురుదాడి చేసే ప్రమాదముందని అటవీ శాఖాధికారులు హెచ్చరించారు.