మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : సోమవారం, 8 జనవరి 2018 (22:53 IST)

రోడ్ రోగ్స్... 19 ఏళ్ల యువతిని చంపేశారు... ఆమె అవయవాలు ఇద్దామన్నా...

రోడ్ రోగ్స్... ఈమాట మనలో చాలామందికి తెలుసు. రోడ్డుపైన అంతా చక్కగా వెళుతున్నప్పుడు సర్రుమంటూ వెనుక నుంచి ఓ బైకు అత్యంత వేగంతో దూసుకువస్తుంది. పాము మెలికలు తిప్పుకుంటూ పెద్ద వాహనాల ముందు వంకర్లు తిరుగుత

రోడ్ రోగ్స్... ఈమాట మనలో చాలామందికి తెలుసు. రోడ్డుపైన అంతా చక్కగా వెళుతున్నప్పుడు సర్రుమంటూ వెనుక నుంచి ఓ బైకు అత్యంత వేగంతో దూసుకువస్తుంది. పాము మెలికలు తిప్పుకుంటూ పెద్ద వాహనాల ముందు వంకర్లు తిరుగుతూ రోడ్డుపై వెళ్తున్నవారికి రక్తపోటు తెప్పించేస్తారు. ఇలాంటివారు ప్రమాదాల్లో చనిపోవడం అటుంచి ఎందరివో అమూల్యమైన జీవితాలను బలి తీసుకుంటుంటారు.
 
 
ఇలాంటి విషాద ఘటనే ముంబైలో జరిగింది. 19 ఏళ్ల యువతిని అత్యంత వేగంతో వచ్చిన ఓ మోటారు బైకు ఢీకొట్టడంతో ఆమె టీ షర్ట్ అందులో ఇరుక్కుపోయి 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. బైకుతో పాటు ఆమె రోడ్డుపై పడి తీవ్ర గాయాలపాలైంది. ఆమె తల డివైడరుకు ఢీకొట్టుకోవడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో బైకు పైన వున్న ముగ్గురు వ్యక్తుల్లో ఓ వ్యక్తి కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
తన కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు శోకంలో మునిగిపోయారు. తన కూతురి మరణానికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా బ్రెయిన్‌ డెడ్‌తో మరణించిన గిరిజ అవయవాలను దానం చేసేందుకు ఆమె పేరెంట్స్ ముందుకు వచ్చినా తీవ్ర రక్తస్రావం కారణంగా ఆమె అవయవాలు పనికిరావన్నారు.