సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 30 మే 2017 (17:36 IST)

ఆ విధంగా ప్రధాని మోదీ ముందు కాలు మీద కాలేసుకుని కూర్చుని... బెర్లిన్‌లో....

ప్రియాంకా చోప్రా అంటే ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీయే కాదు హాలీవుడ్ ఇండస్ట్రీ కూడా కలవరిస్తుంది. ఆమె సినిమాలంటే అంత క్రేజ్ మరి. ఇదిలావుంటే తాజాగా నరేంద్ర మోదీ ఆరు రోజుల విదేశీ పర్యటన నిమిత్తం బెర్లిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. నిన్న ఆయన బెర్లిన్ నగరంలో ద

ప్రియాంకా చోప్రా అంటే ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీయే కాదు హాలీవుడ్ ఇండస్ట్రీ కూడా కలవరిస్తుంది. ఆమె సినిమాలంటే అంత క్రేజ్ మరి. ఇదిలావుంటే తాజాగా నరేంద్ర మోదీ ఆరు రోజుల విదేశీ పర్యటన నిమిత్తం బెర్లిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. నిన్న ఆయన బెర్లిన్ నగరంలో దిగారు. ఈ వార్త తెలుసుకున్న హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఆయన్ను కలుసుకున్నారు. 
 
తను నటించిన హాలీవుడ్ మూవీ 'బే వాచ్'ని ప్రమోట్ చేసుకునేందుకు సినిమా యూనిట్ సభ్యులతో కలిసి బెర్లిన్‌లో పర్యటిస్తోంది. అదే సమయంలో ప్రధానమంత్రి కూడా అక్కడికి రావడంతో విషయం తెలుసుకుని ప్రధానిని కలుసుకున్నారు ప్రియాంకా. తన బిజీ షెడ్యూల్లో కూడా ప్రధానమంత్రి తనకు సమయం కేటాయించినందుకు ఎంతో ధన్యవాదాలంటూ కామెంట్ పోస్టు చేసింది. పనిలో పనిగా ఆయనతో కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది ప్రియాంకా చోప్రా.