మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: మంగళవారం, 15 డిశెంబరు 2020 (20:20 IST)

బాలీవుడ్ నటి నర్సుగా మారి కరోనా రోగులకు సేవ, కానీ పక్షవాతం ఆమెను ఆక్రమించింది

ఫోటో కర్టెసీ-ట్విట్టర్
పరులకు సేవ చేయాల్సిన ఆలోచన అందరికీ ఉండదు. ఏ కొందరికో ఆ ఆశయం ఉంటుంది. అలాంటి వారిలో శిఖా మల్హోత్రా ఒకరు. సినిమాల్లో అడుగుపెట్టక ముందే నర్సింగ్ కోర్సు చేసిన శిఖ కరోనా బారిన పడినా ప్రజలకు తనవంతు సహాయం చేయాలనుకున్నారు.
 
లాక్ డౌన్ కాలంలో ముంబైలోని మున్సిపల్ కార్పొరేషన్లో నడిచే ఆసుపత్రిలో నర్సుగా చేరింది మల్హోత్రా. ఆరు నెలల పాటు నిద్రాహారాలు మానేసి రోగులకు సేవలందించింది. కానీ అనుకోని విషాదం ఆమె అందమైన జీవితాన్ని తలకిందులు చేసేసింది. గత అక్టోబర్ నెలలో కరోనా మహమ్మారి బారిన పడింది.
నెల రోజుల తరువాత కోలుకుంది. అయితే డిసెంబర్ 10వ తేదీన పక్షవాతానికి గురికావడంతో ఆమెను హుటాహుటిన ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రానురాను ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆమె శరీరంలోని కుడివైపు భాగమంతా చచ్చుపడిపోయింది. నోటమాట కూడా రావడం లేదు. ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. అయితే ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. మనమూ ప్రార్థిద్దాం.