సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 15 డిశెంబరు 2020 (11:58 IST)

డిసెంబర్ 15 బర్త్ డే బేబీ లావణ్యకు కోపం విపరీతం, అందుకే గీత గోవిందం గోవిందా?

లావణ్య త్రిపాఠి పుట్టినరోజు డిసెంబర్ 15. ఈ బర్త్ డే బేబీకి అభిమానులు శుభాకాంక్షలు చెపుతున్నారు. ఉత్తరాఖండ్ బ్యూటీగా టైటిల్ కూడా సాధించిన ఈ 'అందాల రాక్షసి'కి అన్నీ మంచి గుణాలు వున్నాయంట ఒక్కటి తప్ప. అదే విపరీతమైన కోపం.
ఆ కోపం కారణంగా కొన్నింటిని కోల్పోయానని చెపుతోంది. గీత గోవిందం ఛాన్స్ మొదట తనకే వచ్చిందనీ, ఐతే కొన్ని కారణాల వల్ల దాన్ని వదులుకున్నానని అంటోంది. ఆ కారణాలలో కోపం వున్నదనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనప్పటికీ లావణ్య చెప్పినట్లు కోపంతో ఎన్నో విలువైనవి కోల్పోతాం. అందుకే శాంతంగా వుండాలి. అదే సాధన చేస్తున్నట్లు చెపుతోందీ బ్యూటీ.
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ల జాబితాలో పేరు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మకు మనం కూడా బర్త్ డే విషెస్ చెప్పేద్దాం.