బాలీవుడ్ బాద్ షాకు సూపర్ స్టార్ బర్త్ డే విషెస్.. ఫోటో వైరల్

Mahesh Babu_sharukh Khan
Mahesh Babu_sharukh Khan
సెల్వి| Last Updated: సోమవారం, 2 నవంబరు 2020 (17:14 IST)
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ 55వ వసంతంలోకి అడుగుపెట్టారు. షారూఖ్ బర్త్‌డే సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో షారూఖ్ ఖాన్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా బర్త్‌డే విషెస్ అందించారు. నమ్రత, షారూఖ్‌తో కలిసి దిగిన ఫోటోని మహేష్ బాబు షేర్ చేశారు.

''నాకు తెలిసిన అత్యంత సౌమ్యులలో షారూఖ్‌ఖాన్ ఒకరు. ఆయన ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను'' అంటూ మహేష్ స్పష్టం చేశారు. మహేష్ ప్రస్తుతం పరశురాం సినిమాతో బిజీగా ఉండగా, ఈ సినిమా మరికొద్ది రోజులలో సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వైవిధ్యమైన కథతో రూపొందిస్తున్నారు. ఇక షారూఖ్ త్వరలో అట్లీతో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నట్టు సమాచారం.దీనిపై మరింత చదవండి :