సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 నవంబరు 2020 (09:19 IST)

'ఎరుపు రంగు' దుస్తుల్లో హృదయ అందాల ఆరబోత!!

తెలుగులోని కుర్ర హీరోయిన్లలో హెబ్బా పటేల్ ఒకరు. "కుమార్ 21ఎఫ్" చిత్రంతో ఆమె టాలీవుడ్‌ వెండితెరకు పరిచయమైంది. ఎంతో క్యూట్ క్యూట్‌గా కనిపించే ఈ భామ.. ఇటీవలికాలంలో అందాల ఆరబోతలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అదేసమయంలో అటు అందాలు, ఇటు నటన కారణంగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అలాగే, తన ఫ్యాన్ ఫాలోయర్ల సంఖ్యను కూడా విపరీతంగా పెంచుకుంది.
 
ఈ క్రమంలో తాజాగా ఫొటోషూట్‌లో హెబ్బా పాల్గొంది. ఎరుపు రంగు దుస్తుల్లో మెడ‌లో మెరిసే బంగారు చైన్‌తో కెమెరాకు ఫోజులిచ్చింది. కొత్త లుక్‌తో కుర్ర‌కారు మ‌న‌సు దోచేస్తుంది. మెస్మ‌రైజ్ చేసే అందంతో హెబ్బా ప‌టేల్ దిగిన ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.
 
ఈ బ్యూటీ ప్ర‌స్తుతం "ఓదెల రైల్వే స్టేష‌న్" చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. పల్లెటూరి అమ్మాయిగా డీగ్లామ‌రైజ్‌డ్ పాత్ర‌లో క‌న‌పించ‌నుంది. ‌సంపత్‌ నంది కథతో నిర్మాత కేకే రాధామోహన్‌ తెరకెక్కిస్తున్న డిఫరెంట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌‌గా 'ఓదెల రైల్వే స్టేషన్‌' తెరకెక్కుతోంది.