గురువారం, 13 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 జనవరి 2024 (22:22 IST)

దాదాసాహెబ్ అవార్డ్స్.. దియా మీర్జా, అదితిరావ్ హైదరి లుక్స్ అదుర్స్

Dia Mirza
Dia Mirza
ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024 ఫిబ్రవరి 20న జరుగనుంది. గాలాలో జరుగనున్న ఈ కార్యక్రమానికి ముందు గురువారం ముంబైలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో, అతిథిలలో ఒకరైన నటి దియా మీర్జా, సమాజాన్ని రూపొందించడంలో సినిమా ఎల్లప్పుడూ ఎలా ప్రధాన పాత్ర పోషిస్తుందో, ఓటీటీ ఆగమనం చలన చిత్ర నిర్మాణ పరిశ్రమకు ఎలా మలుపు తిరిగింది అనే విషయాలపై ప్రస్తావించింది. 
Dia Mirza
Dia Mirza
 
దేశంలో సినిమా పరిణామంతో తన ప్రయాణం ఎలా సాగిందో దియా పంచుకుంది. మన సినిమాలు మన సమాజం, సంస్కృతి, భావజాలానికి అద్దం పడతాయని, మన సినిమా నిర్మాతలు మంచి కథలు చెప్పాలని, తద్వారా ప్రజలు మంచి విషయాలు నేర్చుకుని సమాజంలోని లోపాలను రూపుమాపేందుకు కృషి చేయాలని దియా పేర్కొన్నారు. 
 
ఇంకా దియా మాట్లాడుతూ, "సినిమా పరిశ్రమలో నా ప్రయాణం సమానత్వం అనే భావనలను నేను అర్థం చేసుకోవడంలో ఏ ఇతర ఉద్యోగానికైనా సహాయపడింది." అంటూ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదితిరావ్ హైదరి తదితరులు పాల్గొన్నారు. 
Dia Mirza_Aditi
Dia Mirza_Aditi