సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2023 (19:15 IST)

సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ మధ్య ఏం జరుగుతోంది?

Siddharth and Aditi Rao
Siddharth and Aditi Rao
సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ మధ్య ఏం జరుగుతోంది? ఈ ప్రశ్న సామాన్య అభిమానులకే కాదు, వారికి దర్శకత్వం వహించిన దర్శకుడు అజయ్ భూపతికి కూడా ఎదురవుతుంది. వారి రిలేషన్‌షిప్‌పై ఆయన చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. 
 
సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ జంటగా మహాసముద్రం చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. నిజానికి ఆ సినిమా నుంచే సిద్ధార్థ్, అదితి మధ్య ఏదో నడుస్తోందని పుకార్లు మొదలయ్యాయి. 
 
వీరి మధ్య కచ్చితంగా ఏదో ఉందని అభిమానులు ఫిక్స్ అవ్వడంతో.. దర్శకుడు అజయ్ భూపతి కూడా దీనిపై స్పందించారు. సిద్ధార్థ్-అదితి చాలా క్లోజ్ సెల్ఫీని పోస్ట్ చేశారు. "దీనికి కారణం నేనే అని అందరూ అంటారు. అసలు ఏం జరుగుతోంది?" దీన్ని అజయ్ భూపతి సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. 
 
ఈ జంటను డైరెక్ట్ చేసిన వ్యక్తి కూడా ఇదే ప్రశ్న అడగడంతో వీరిద్దరి మధ్య బంధం ఏర్పడ్డ విషయం అందరికీ తెలిసిందే.
 
 నిజానికి, సిద్ధార్థ్ ఇంతకుముందు అదితి పుట్టినరోజున తన భాగస్వామి అని పిలిచి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేశాడు.