శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 2 ఏప్రియల్ 2020 (23:29 IST)

లేటు వయస్సులోనూ మాజీ విశ్వ సుందరి సుస్మితాసేన్ ఇలా

మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించి ఇప్పటికే ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది సుస్మితాసేన్. ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. స్టార్ హీరోయిన్‌గా సుస్మితాసేన్‌కు మంచి పేరే ఉంది. ఎన్నో హిట్ సినిమాల్లో ఆమె నటించి అభిమానులను మెప్పించింది. అయితే అలాంటి సుస్మితాసేన్ ప్రస్తుతం వివాదాల్లో నిలుస్తోంది. 
 
తనకన్నా చిన్న వయస్సు వ్యక్తితో కలిసి వర్కవుట్ ఫోజులిస్తోంది. అది కూడా హాట్ హాట్ ఫోటోలతో అభిమానులకు కోపం తెప్పిస్తోంది. 1996 సంవత్సరంలో సినీరంగంలో అడుగుపెట్టిన సుస్మితా ఆ తరువాత వెనుతిరిగి చూడనేలేదు. 2014 సంవత్సరం వరకు ఆమె నటించిన సినిమాల్లో సగానికిపైగా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్లే.
 
అయితే 2015సంవత్సరం తరువాత ఆమె మళ్ళీ సినిమాల జోలికి వెళ్ళలేదు. అయితే ఆమె సినిమాల్లో నటించేటప్పుడు ఎంతోమంది హీరోలతో అఫైర్లు ఉన్నట్లు గాసిప్స్ బాగానే వినిపించాయి. ఆమె ఎంతోమంది హీరోలతో డేటింగ్‌లు చేసిందన్న ప్రచారం బాగానే జరిగింది. అంతేకాదు తల్లి కావాలన్న ఆశతో ఆమె ఇద్దరు పిల్లలను దత్తత కూడా తీసుకుంది. 
 
సుస్మితా అంటే చాలు.. చాలామంది వివాదాలకు కేరాఫ్‌గా మారిపోయిందనేవారు. అయితే ప్రస్తుతం తనకన్నా 15 సంవత్సరాలకు పైగా చిన్నవాడైన వ్యక్తితో తీసుకున్న ఫోటోలను కూడా ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేస్తోంది సుస్మిత. ఇది చూస్తున్న అభిమానులు కొంతమంది ఏకీభవిస్తే.. మరికొంతమంది ఈ వయస్సులో కూడా సుస్మిత హాట్ అంటూ మెసేజ్‌లు పెట్టేస్తున్నారు.