శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 మార్చి 2020 (12:20 IST)

నా పిల్లలు ఇలా మాస్కులు ధరించి ఇబ్బంది పడుతుంటే?

పోర్న్ కమ్ బాలీవుడ్ స్టార్‌గా మారిన సన్నీలియోన్.. కేవలం ఎక్స్‌పోజింగ్‌కి స్కోప్ ఉన్న పాత్రలే కాక పాత్రకి ప్రాధాన్యమున్న సినిమాలను కూడా ఓకే చేస్తుంది. దీంతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అటు ఉత్తరాది, ఇటు దక్షిణాదిన తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న సన్నీలియోన్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుంటోంది. 
 
సోషల్ మీడియాలో సన్నీ లియోన్ పెట్టే పోస్టులు చూసినప్పుడు సన్నీలో ఇంతటి హోమ్లీ ఉమెన్ ఉందా? అన్నంతలా ఆశ్చర్యపోతున్నారు చాలామంది. ప్రస్తుతం కరోనా భయాందోళనల నేపథ్యంలో సెలబ్రిటీలు ఎవరికి వారు తమ షూటింగ్‌లను క్యాన్సిల్ చేసుకుని మరి ఇళ్ళకే పరిమితమయ్యారు. తమ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎంజాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ని వాళ్ళసోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా పంచుకుంటున్నారు. 
 
 
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సన్నీ లియోన్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా మాస్కులు ధరించిన ఫోటోను కూడా ఈమె షేర్ చేసింది. ఇందులో తన పిల్లలు ఇలా మాస్కులు ధరించి ఇబ్బంది పడుతుంటే తనకు చాలా బాధగా వుందని.. కానీ తప్పడం లేదంటూ వ్యాఖ్యానించింది. ఇలా జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అంటూ ఆమె మెసేజ్ ద్వారా తెలిపారు. ఇది ఇప్పుడుచాలా అవసరమని పేర్కొన్నారు.