మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (14:16 IST)

అఫ్రిదిని మెచ్చుకున్న భజ్జీ.. ప్రపంచమంతా బాగుండాలి

Shahid Afridi
పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది దాతృత్వాన్ని చాటుకున్నాడు. సుమారు రెండు వేల కుటుంబాలకు ఉచితంగా రేషన్‌తో పాటు నిత్యవసర సరకులు అందజేశాడు. అఫ్రిదీ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ మెచ్చుకున్నాడు. మానవత్వంతో మంచి పనిచేశావని కొనియాడాడు. అందరినీ ఆ దేవుడు చల్లగా చూడాలని.. అఫ్రిదికి శక్తి చేకూరాలని తెలిపాడు. 
 
ప్రపంచమంతా బాగుండాలని ప్రార్థిస్తున్నానని అఫ్రిదీని మెచ్చుకుంటూ భజ్జీ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన పాక్‌ మాజీ ఆల్‌రౌండర్‌ అన్నింటికన్నా మానవత్వమే పెద్దదని వ్యాఖ్యానించాడు. అలాగే భజ్జీ దయార్థ హృదయంతో చెప్పిన మాటలకు ధన్యవాదాలు తెలిపాడు. కరోనా వైరస్‌పై పోరాడాలంటే ప్రపంచమంతా ఏకమవ్వాలి. పేదలకు, అవసరమైనవారికి వీలైనంత మేర సాయం చేయడం మన బాధ్యత అని షాహిద్‌ అఫ్రిది రీట్వీట్‌ చేశాడు.