మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (19:07 IST)

థ్యాంక్యూ మిత్రమా.. రాననుకున్నావా? రాలేననుకున్నావా?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిప్పునీరుగా ఉండే హీరోలు ఎవరయ్యా అంటే ఠక్కున చెప్పే సమాధానం చిరంజీవి - మోహన్ బాబు. కానీ, ఇది బయటకు మాత్రమే. నిజానికి వారిద్దరూ మంచి మిత్రులు. వారిద్దరి మంచి అనుబంధం ఉంది. ఇరు కుటుంబాల మధ్య మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. కానీ, బాహ్య ప్రపంచానికి మాత్రం మోహన్ బాబు - చిరంజీవిల మధ్య బద్ధశత్రుత్వం ఉందనే ప్రచారం ఉంది. ఇదే విషయంపై వారిద్దరూ పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. కానీ, వారిద్దరి స్నేహంపై వచ్చిన చెడ్డపేరు మాత్రం పోలేదు.
 
ఈ పరిస్థితుల్లో ఉగాది పర్వదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. ఈ ఖాతాలు గంటల్లో వేల సంఖ్యలో పాలోయర్లు చేరిపోయారు. చిరంజీవికి పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు వస్తున్నాయి. ఆయన మిత్రుడు మోహన్ బాబు కూడా ట్విట్టర్‌లో స్వాగతం పలికారు. అందుకు చిరంజీవి స్పందిస్తూ, "థాంక్యూ మిత్రమా... రాననుకున్నావా రాలేననుకున్నావా" అంటూ సినీ ఫక్కీలో వ్యాఖ్యానించారు.
 
దానికి మోహన్ బాబు వెంటనే బదులిచ్చారు. "ఈసారి హగ్ చేసుకున్నప్పుడు చెబుతాను" అంటూ కొంటెగా స్పందించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మోహన్ బాబును చిరంజీవి ఆప్యాయంగా హత్తుకుని బుగ్గపై ముద్దు పెట్టారు. వారిద్దరి మధ్య స్నేహానికి ఈ సన్నివేశం ఓ నిదర్శనంలా నిలిచింది.