ఉగాది పర్వదినం రోజున మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ?
మెగాస్టార్ చిరంజీవి మరోమారు ఎంట్రీ ఇవ్వనున్నారు. తెలుగు వెండితెరపై మెగాస్టార్‌గా ఉన్న చిరంజీవి... ఇపుడు సోషల్ మీడియాలోకి తొలిసారి అడుగుపెట్టనున్నారు. ఇందుకోసం తెలుగు కొత్త సంవత్సరమైన ఉగాది పర్వదినాన ఆయన తన సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించి ఎంట్రీ ఇవ్వనున్నారు.
నిజానికి చిరంజీవికి ఇప్పటివరకు ఎలాంటి సోషల్ మీడియా ఖాతా లేదు. ఆయన చేసే పోస్టులు, వీడియోలు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ లేదా సినిమా పీఆర్వోల ఖాతాల్లో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే, ఇకపై ఆయన స్వయంగానే సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
ఇందులోభాగంగా, ఉగాది సందర్భంగా సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నా అభిమానులతో ఎప్పటికపుడు నా అభిప్రాయాలు, సందేశాలు చేరవేస్తానని చిరు చెప్పిన వీడియోను ప్రముఖ సినీ పీఆర్వో బీఏ రాజు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇపుడు వైరల్ అవుతోంది.