మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 మార్చి 2020 (19:05 IST)

రాధికా ఆప్టే మాస్క్ ధరించిన ఫోటో వైరల్..

Radhika Apte
బాలీవుడ్ అగ్ర హీరోయిన్ రాధికా ఆప్టే మాస్క్ ధరించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం లండన్‌లోన తన భర్త దగ్గర ఉన్న బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే.. ఇటీవల ఆసుపత్రికి వెళ్లారు. దానికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందులో ఆమె మాస్క్‌ను ధరించి ఉంది. ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ జడుసుకున్నారు. 
 
రాధికా ఆప్టే ఆరోగ్యానికి ఏమైందని అందరూ చర్చించుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా వుంది అంటూ ప్రశ్నలు వేశారు. దీనిపై స్పందించిన రాధికా ఆప్టే.. తన ఆరోగ్య పరిస్థితి బాగానే వుందని తెలిపింది. తన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు చాలామంది మెసేజ్‌లు చేశారు. 
 
ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలనుకుంటున్నానని వెల్లడించింది. తన ప్రాణ స్నేహితురాలి రెగ్యులర్ ప్రెగ్నెన్సీ చెకప్‌ కోసం తాను ఆస్పత్రికి వెళ్లానని రాధికా ఆప్టే క్లారిటీ ఇచ్చింది. దీంతో రాధికా ఆప్టే ఫ్యాన్స్ హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు.