బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (15:10 IST)

నిరాడంబరంగా బ్రహ్మానందం వేడుక.. కనిపించని సహ నటీనటులు

నటుడు బ్రహ్మానందం పుట్టినరోజు ఈరోజు. ఫిబ్రవరి 1న ప్రతిసారీ ఏదో ఒక షూటింగ్‌లో చిత్ర యూనిట్‌ ముందు కేక్‌లు కట్‌చేయడం.. ప్రత్యేక భోజనం తినడం ఆనాయితీ. కానీ ఈసారి బెడిసికొట్టింది. అందుకే తన ఇంటివద్దే నిరాడ

నటుడు బ్రహ్మానందం పుట్టినరోజు ఈరోజు. ఫిబ్రవరి 1న ప్రతిసారీ ఏదో ఒక షూటింగ్‌లో చిత్ర యూనిట్‌ ముందు కేక్‌లు కట్‌చేయడం.. ప్రత్యేక భోజనం తినడం ఆనాయితీ. కానీ ఈసారి బెడిసికొట్టింది. అందుకే తన ఇంటివద్దే నిరాడంబరంగా కేక్‌ కట్‌చేశారు. అతని సన్నిహితులు మేనేజర్లు మినహా హాస్య నటులెవరూ పెద్దగా రాలేదు. 'మా' టీమ్‌ రాజేంద్రప్రసాద్‌, శివాజీరాజా వంటివారు మాత్రం శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
కాగా, దేవుడి పైనుంచి ఓ లైట్‌ వేశాడు.. అదింకా నామీదే పడుతుంది. అది వున్నంతకాలం.. నా హవాకొనసాగుతుందని పలుసార్లు తన కెరీర్‌ గురించి చెప్పిన బ్రహ్మానందం..ఈ సారి ఆ లైట్ వపర్‌ తగ్గిందనిపిస్తుంది. కొత్తతరం రావడంతో బ్రహ్మానందం చేసే నటన, ఎంచుకున్న పాత్రలు రొటీన్‌గా ఉండడంతో 'ఖైదీ నెం.150'లో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.