సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 8 మార్చి 2019 (17:51 IST)

'మా' ఎన్నిక‌ల్లో విజేత ఎవ‌రో ముందే చెప్పేసిన‌ బ్ర‌హ్మానందం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు ఈ నెల 10న జ‌ర‌గ‌నున్నాయి. అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతోన్న‌ శివాజీరాజా, న‌రేష్ పోటాపోటీగా ప్ర‌చారం చేస్తున్నారు. ఈ రోజు "మా"ఎలక్షన్స్ పురస్కరించుకుని.. ప్రముఖ హాస్యనటులు పద్మశ్రీ  బ్రహ్మానందంని ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన స్వగృహంలో.. శ్రీకాంత్, శివాజీరాజా, రఘుబాబు, ఉత్తేజ్, సురేష్ కొండేటి కలిశారు. 
 
ఈ సంద‌ర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.." పేద కళాకారులు, వృద్ద కళాకారులు శివాజీరాజాని వేనోళ్ళ పొగడటం నేను గమనించాను. మా కళాకారుల కోసం తను చేస్తున్న  మంచి పనులే తనని గెల్పిస్తాయని... శివాజీరాజా ప్యానెల్ తప్పనిసరిగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ.. త‌న‌ ఆశీర్వాదాలెప్పుడూ ఉంటాయని.." చెప్పారు.