శుక్రవారం, 18 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 5 జులై 2016 (15:30 IST)

సుందర్ సి సినిమాలో విజయ్, మహేష్ బాబు: రూ.100కోట్ల బడ్జెట్‌తో సినిమా!

శ్రీ తేనాండాళ్ ఫిలిమ్స్ పతాకంపై వందో సినిమాను ప్రముఖ నటి ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్ సి భారీ బడ్జెట్‌తో రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో భారీ తారాగణం ఉంటుందని కోలీవుడ్‌లో హాట్ హాట్‌గా చర్

శ్రీ తేనాండాళ్ ఫిలిమ్స్ పతాకంపై వందో సినిమాను ప్రముఖ నటి ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్ సి భారీ బడ్జెట్‌తో రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో భారీ తారాగణం ఉంటుందని కోలీవుడ్‌లో హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. రూ.100 కోట్ల బడ్జెట్‌తో.. రికార్డుల్ని బద్ధలు కొట్టేలా తయారు కానున్న ఈ సినిమాలో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటోంది. 
 
సుందర్ సి తమిళ వెర్షెన్‌లో విజయ్, తెలుగు వెర్షెన్‌లో మహేష్ బాబు నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చుతుండగా, గ్రాఫిక్స్ వర్క్‌ను కమలకణ్ణన్ చేపట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. హిస్టారికల్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు Brobdingnagian అనే పేరును ఖరారు చేయనున్నట్లు తెలిసింది.