మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 3 మే 2017 (18:34 IST)

రజనీకాంత్‌తో రాజమౌళి సినిమా ప్లాన్స్..? బాహుబలి రికార్డు బద్దలేనా?

'బాహుబలి' చిత్రంతో ఒక్కసారి టాప్ డైరక్టర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి. అలాంటి దర్శకుడు ఓ సూపర్ స్టార్‌తో చిత్రం తీయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఆ సూపర్ స్టార్ ఎవరో కాదు... రజనీకాంత

'బాహుబలి' చిత్రంతో ఒక్కసారి టాప్ డైరక్టర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి. అలాంటి దర్శకుడు ఓ సూపర్ స్టార్‌తో చిత్రం తీయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఆ సూపర్ స్టార్ ఎవరో కాదు... రజనీకాంత్. రజనీకాంత్‌తో సినిమా చేసే అవకాశం వస్తే వదులుకోనని రాజమౌళి వ్యాఖ్యానించారు.
 
ఇదే అంశంపై రాజమౌళి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను వెల్లడించారు. భారత సినీ రంగంలోని టాప్ స్టార్స్‌లో ఒకరైన రజనీకాంత్‌తో సినిమా చేయాలని ఏ డైరెక్టర్ అయినా కోరుకుంటాడని చెప్పాడు. నిజంగానే రజనీతో సినిమా చేయాలనే కోరిక తనకు కూడా ఉందని... ఆయన ఇమేజ్‌కు తగ్గ కథ దొరికితే తప్పకుండా సినిమా చేస్తానని చెప్పాడు. 
 
ముఖ్యంగా అంత గొప్ప అవకాశం వస్తే తన కన్నా సంతోషించే వ్యక్తి మరొకరు ఉండరన్నారు. కాగా, కొన్నేళ్లుగా బాహుబలి సినీ నిర్మాణంతో అలసి పోయిన రాజమౌళి... ఇప్పుడు హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. తన ఫ్యామిలీతో కలసి లండన్‌లో సేదతీరుతున్నాడు.